Watch: ఇంధనం లేక ఆగిన పోలీస్ వాహనం.. నిందితులతో నెట్టించిన వైనం
Accused Push Police Vehicle | పోలీస్ వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ పోలీస్ వాహానాన్ని కొంత దూరం తోయించారు. (Accused Push Police Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: పోలీస్ వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ పోలీస్ వాహానాన్ని కొంత దూరం తోయించారు. (Accused Push Police Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఆ నిందితులను పోలీస్ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు.
కాగా, పోలీస్ వాహనంలో ఇంధనం నిండుకోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు. వారితో ఆ పోలీస్ వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం వరకు పోలీసు అధికారులు తోయించారు. గమనించిన స్థానికుల్లో కొందరు దీనిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
पुलिस की गाड़ी में पेट्रोल खत्म, कैदियों ने मारा धक्का
नवगछिया से 4 कैदी पेशी के लिए आए भागलपुर, कोर्ट के 500 मीटर पहले गाड़ी रुक गई pic.twitter.com/IawDYq2uBU
— FirstBiharJharkhand (@firstbiharnews) February 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

