కానిస్టేబుల్‌ను కొట్టిన మహిళా ఎమ్మెల్యే.. కేసు నమోదు
మహిళా ఎమ్మెల్యే| అర్ధరాత్రి వేళ బైక్‌పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడిని ఓ కానిస్టేబుల్ ఆపాడు. దీంతో అతడు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ ప్రజాప్రతినిథి నా మనిషినే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై చేసుకున్నది.

జైపూర్: అర్ధరాత్రి వేళ బైక్‌పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడిని ఓ కానిస్టేబుల్ ఆపాడు. దీంతో అతడు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ ప్రజాప్రతినిథి నా మనిషినే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై చేసుకున్నది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఆదివారం జరిగింది.
రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. అతడు తాను ఎమ్మెల్యే అనుచరుడినని, తననే ఆపుతావా అని గొడవకు దిగాడు. వెంటనే బన్స్వారా ఎమ్మెల్యే రమీలా ఖదియాకు ఫోన్‌చేశాడు. ఆమె నిమిషాల్లో అక్కడికి చేరుకున్నది. హెడ్‌కానిస్టేబుల్ నరేంద్రనాథ్‌తో వాగ్వాదానికి దిగింది. మొత్తానికి తన అనుచరుడిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. అయితే కానిస్టేబుల్‌పై ఆ మహిళా ఎమ్మెల్యే చేయి చేసుకున్నది ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఆ ఎమ్మెల్యే తిరస్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

