Delhi Chalo | టీ-బిస్కెట్లిచ్చి.. పూలు జల్లి.. రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా
తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు.
- ఆపై బాష్ప వాయు గోళాలు, జల ఫిరంగులతో దాడి చేసి..
- చలో ఢిల్లీ పాదయాత్ర చేపట్టిన అన్నదాతలపై దాష్టీకం
- పలువురికి గాయాలు.. తాత్కాలికంగా యాత్ర నిలిపివేత
Delhi Chalo | న్యూఢిల్లీ, డిసెంబర్ 8: తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా చల్లడంతో రైతులు విస్తుపోయారు.
రైతులు ఢిల్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, అప్పటి వరకు తాము ఆడిన డ్రామాకు తెరదించిన పోలీసులు వారిని అడ్డుకోవడం ప్రారంభించారు. రైతులను చెదరగొట్టడానికి నిర్దాక్షిణ్యంగా బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడగా, ఒకరిని దవాఖానకు తరలించినట్టు రైతు నేత శర్వణ్ సింగ్ పాంథేర్ తెలిపారు. రైతు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆయన ప్రకటించారు. తదుపరి కార్యాచరణను సోమవారం నిర్ణయిస్తామని చెప్పారు.
నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష
నోయిడాలో ఆందోళన చేయడంతో అరెస్టయి జైలులో ఉన్న రైతులు తమ డిమాండ్ల సాధనకు జైలులో నిరాహార దీక్ష ప్రారంభించినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం తెలిపింది. ప్రస్తుతం గౌతమబుద్ధ నగర్ జైలులో ఉన్న రైతులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధనకు ఈ దీక్ష చేపట్టారని పేర్కొంది. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నా డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష చేస్తామని రైతులు స్పష్టం చేశారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Delhi Chalo
- farmers
- Padayatra
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

