Rahul Gandhi | రాహుల్ గాంధీ ధర్నా భగ్నం.. కాంగ్రెస్ నేతల అరెస్టుతో ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత..!
Rahul Gandhi : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Rahul Gandhi : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఐదు డిమాండ్లతో ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా తమ డిమాండ్ల కోసం పట్టుబట్టిన ఆయనను బలవంతంగా మోడీ ఇంటి ముందు నుంచి లాక్కెళ్లారు పోలీసులు. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా మంగళవారం ప్రధాని నివాసానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా చేతులకు సంకెళ్లతో రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు అక్కడ బైఠాయించి. విషయం తెలిసి చర్చల కోసం కేంద్రమంద్రిని పంపగా.. రాహుల్ వెనక్కి తగ్గలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ మృతులకు రూ.1కోటి పరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg, detained by Delhi Police. pic.twitter.com/mkctEgsybl
— ANI (@ANI) July 21, 2026
దాదాపు మూడు గంటలకు పైగా వారంతా అక్కడే కూర్చొన్నారు. దాంతో, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా వచ్చి మాట్లాడినా.. బుజ్జగించే ప్రయత్నం చేసినా రాహుల్ వినలేదు. అక్కడి నుంచి నేరుగా హోం మంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్లిన జితేంద్ర.. మళ్లీ రాహుల్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన మేము ఇక్కడి నుంచి కదలం అని భీష్మించుకున్నారు. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ సహా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కార్యకర్తలను ప్రధాని నివాసం ముందు నుంచి తరలిస్తున్నారు.
Delhi: Union Minister Jitendra Singh reached the opposition protest near the Prime Minister’s residence and asked Leader of Opposition Rahul Gandhi and other protesters to vacate the high-security zone. Rahul Gandhi demanded the resignations of Prime Minister Narendra Modi and… pic.twitter.com/pV4p519i7A
— Well & Thirst (@wellandthirst) July 21, 2026
5 డిమాండ్స్ ఇవే..
- విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి
- నీట్ పేపర్ లీక్‌తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి నష్ట పరిహారం అందించాలి
- ‘ఛలో పార్లమెంట్’ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి, హింసపై దర్యాప్తు చేయాలి
- విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

