PM Modi | వారి చర్య మా ప్రభుత్వానికి దిష్టి చుక్కలాంటిదే.. కాంగ్రెస్ బ్లాక్‌పేపర్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
PM Modi | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన ‘బ్లాక్ పేపర్’ (Congress Black Paper)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’ (Kaala Tika) లాంటిదని వ్యాఖ్యానించారు.
PM Modi | గత పదేళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన ‘బ్లాక్ పేపర్’ (Congress Black Paper)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’ (Kaala Tika) లాంటిదని వ్యాఖ్యానించారు. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘బ్లాక్ పేపర్’ను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ పత్రాన్ని విడుదల చేసిన వెంటనే ప్రధాని మోదీ.. పదవీకాలం ముగియనున్న ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు రాజ్యసభకు వెళ్లారు. సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చర్యపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ఖర్గేజీ ఇక్కడ ఉన్నారు. ఓ పిల్లాడు ఏదైనా మంచి చేస్తే. ప్రత్యేక సందర్భంలో ఆ పిల్లాడికి మంచి దుస్తులు వేస్తే.. చెడు కళ్లు పడకుండా ఉండేందుకు కుటుంబంలో ఎవరైనా దిష్టి చుక్క పెడతారు. అలాగే, గత 10 ఏళ్లుగా దేశం కొత్త శ్రేయస్సు శిఖరాలను అధిరోహిస్తోంది. అందుకు మన ప్రభుత్వంపై చెడు కన్ను పడకుండా మనం సురక్షితంగా ఉండేందుకు కాలా తిక (దిష్టి చుక్క) పెట్టే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపులు (evil eye) పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం. అందుకు నేను ఖర్గే జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ మోదీ వ్యంగ్యంగా స్పందించారు.
Also Read..
Parliament | పార్లమెంట్ వేదికగా వైట్ పేపర్ Vs బ్లాక్ పేపర్.. అసలేంటీ వార్..?
Nitish Kumar | ఇక ఎప్పటికీ ఎన్డీయే కూటమిని వదలను : నితీశ్ కుమార్
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రచారకర్తగా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

