Central Vista: మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు: అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. సభకు సంరక్షకుడైన లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ వెంట ఎందుకు లేరు? అని ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్‌తో కలిసి కాకుండా ప్రధాని మోదీ ఒంటరిగా వెళ్లి కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని పరిశీలించడం చాలా తప్పన్నారు.
‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం పార్లమెంట్. అధికారాల విభజన సిద్ధాంతం ప్రకారం న్యాయవ్యవస్థ లేదా శాసనసభ కార్యకలాపాల్లో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎగ్జిక్యూటివ్‌లో భాగమైన ప్రధాని మోదీ దీనిని ఉల్లంఘించారు’ అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. లోక్‌సభ స్పీకర్ వెంట లేకుండా మోదీ ఒంటరిగా కొత్త పార్లమెంట్ నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లకూడదని అన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ, నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్టా పనుల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండానే ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు సందర్శించి గంట సేపు గడిపారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కాగా, మోదీ చర్యను అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

