కరోనా దెబ్బకు పడిపోయిన ప్రధాని రేటింగ్..!
PM Modi rating: ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో

న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు.
గత మూడు దశాబ్దాల్లో ఏ ఇండియన్ లీడర్‌కు సాధ్యం కానీ మెజారిటీని ప్రధాని నరేంద్రమోదీ సుసాధ్యం చేశారు. దాంతో బలమైన జాతీయస్థాయి నాయకుడిగా ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసింది. కరోనా కట్టడి కోసం సన్నద్ధమవడంలో మోదీ ప్రభుత్వం విఫలం కావడంవల్లే మహమ్మారి వేగంగా విస్తరించిందని విమర్శలు వెల్లువెతున్నాయి.
అమెరికాకు చెందిన డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్స్ ప్రపంచస్థాయి నేతల పాపులారిటీని నిరంతరం ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు వెల్లడిస్తుంటుంది. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ వారం ప్రధాని మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. 2019, ఆగస్టులో తాము ప్రధాని మోదీ పాపులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యంత కనిష్ట రేటింగ్ అని ఆమెరికా రేటింగ్ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
దేశంలో 32 కోట్లు దాటిన కరోనా పరీక్షలు: ICMR
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
గుండె నొప్పి వస్తే తొలి గంటే కీలకం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

