Constitution Day: రాజ్యాంగ విధులను నిర్వర్తించండి: ప్రధాని మోదీ
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశారు. ఓటు హక్కును వినియోగించడం వల్ల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతను నిర్వర్తించాలన్నారు. 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటరుగా మారిన వ్యక్తులను రాజ్యాంగ దినోత్సవం రోజున గౌరవించాలన్నారు. కర్తవ్యాలను నిర్వర్తించడం వల్లే హక్కులు వస్తాయని మహాత్మా గాంధీ విశ్వాసాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
సామాజిక, ఆర్థిక ప్రగతికి విధుల నిర్వహణ కీలకమన్నారు. నేటి తరం తీసుకునే విధానాలు, నిర్ణయాలు రాబోయే తరం జీవితాలను మార్చేస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా వెళ్తున్న దేశాన్ని మదిలో పెట్టుకుని పౌరులు తమ కర్తవ్యాలను అమలు చేయాలన్నారు. మానవ హుందాతనానికి, సమానత్వానికి, విముక్తికి మన రాజ్యాంగం ప్రాధాన్యత ఇస్తుందని, మనకు హక్కులను కల్పిస్తుందని, దీంతో పాటు పౌరులమన్న బాధ్యతలను కూడా కల్పిస్తుందని, దీన్ని మనం ఎప్పుడూ నిర్వర్తించాలని, ఆ విధులే మన బలమైన ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు అవుతాయని మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతలకు కూడా ఆయన ఈ సందర్భంగా నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాతల విజన్, ముందుచూపు ప్రేరణతోనే వికసిత్ భారత్ సాధించాలన్నారు.
On Constitution Day, wrote a letter to my fellow citizens in which I’ve highlighted about the greatness of our Constitution, the importance of Fundamental Duties in our lives, why we should celebrate becoming a first time voter and more…https://t.co/i6nQAfeGyu
— Narendra Modi (@narendramodi) November 26, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

