నేటి నుంచి బెంగళూరులో వైమానిక ప్రదర్శన
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

కాగా, ఈ ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు.

భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్, మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ అండ్ టీ, భారత్ పోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.

ఇండియన్ పెవిలియన్ ద్వారా 115 సంస్థల 227 ఉత్పత్తులను పదర్శిస్తారు. అందులో ఎల్‌ఆర్‌యూ, ఎల్సీఏ-తేజస్, ఎఫ్‌సీఎస్, డిజిటల్ ఫ్లై బై, మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

