నేడు గోరఖ్‌పూర్‌లో ప్రధాని పర్యటన.. రూ.9వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
Pm Modi Gorakhpur tour | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌తో

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌తో పాటు ఎరువుల కర్మాగారంతో సహా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. పర్యటనలో రూ.9600కోట్ల విలువైన జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని పీఎంవో తెలిపింది.

గోరఖ్‌పూర్‌లోని ఎయియ్స్ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న బిహార్, నేపాల్‌కు సైతం సేవలందించనున్నది. రూ.వెయ్యికోట్లకుపైగా వెచ్చించి ఎయిమ్స్‌ను నిర్మించారు. 2016, జూలై 22న ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే అదే రోజు శంకుస్థాపన చేసిన గోరఖ్‌పూర్ ఎరువుల కార్మాగాన్ని సైతం ఇవాళ ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

30 సంవత్సరాలకుపైగా మూతపడి ఉన్న ఎరువుల కర్మాగారాన్ని రూ.8,600వేలకోట్లతో పునరుద్ధరించారు. ఈ ప్లాంట్‌లో ఏటా 12.7 ఎల్ఎంటీ దేశీయ వేపపూతతో కూడిన యూరియా ఉత్పత్తి చేయనున్నది. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కొత్త భవనాన్ని సైతం ప్రధాని ప్రారంభించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

