ASEAN-India Summit: 28న ఇండో-ఏసియా శిఖరాగ్ర సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోదీ
ASEAN-India Summit: ఈ నెల 28న 18వ ఏసియన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. వర్చువల్ విధానంలో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు

న్యూఢిల్లీ: ఈ నెల 28న 18వ ఏసియన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. వర్చువల్ విధానంలో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు వివిధ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బ్రూనై సుల్తాన్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక ఏసియన్-ఇండియా సమ్మిట్‌కు ముందు ఈ నెల 27న జరిగే 16వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ఏసియన్-ఇండియా సదస్సులో భారత్, ఆసియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా కొవిడ్-19, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యాపారం, అనుసంధానం, విద్య, సంస్కృతితోపాటు పలు కీలకరంగాల్లో సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అనంతర ఆర్థిక పురోగతితో సహా ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించనున్నారు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన 17వ ఏసియన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారని, ఈ ఏడాది పాల్గొంటే 9వ సారి ఆయన ఈ సదస్సుల్లో పాల్గొన్నట్లు అవుతుందని విదేశాంగశాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robert Pattinson | కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్సన్.. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్
PM Modi: మనీలాలో గురుద్వార ఖల్సాను సందర్శించిన ప్రధాని మోదీ
OM | ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి, శ్రీలీల స్పెషల్ డ్యాన్స్.. మమ్ముట్టి ప్రశంసలు,ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
US Banking Outage | మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న ఎయిర్‌లైన్స్.. నేడు బ్యాంకులు.. అమెరికాను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు!
Uttarakhand: 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

