PM Modi | అంతర్జాతీయ వ్యవసాయ ఆర్ధిక వేత్తల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని
PM Modi : ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ (NASC) కాంప్లెక్స్‌లో శనివారం జరిగే 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సు (ICAE)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
PM Modi : ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ (NASC) కాంప్లెక్స్‌లో శనివారం జరిగే 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సు (ICAE)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తారని పీఎంఓ వెల్లడించింది. 65 ఏండ్ల తర్వాత భారత్‌లో ఐసీఏఈ జరగనుంది. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్ధల దిశగా ప్రస్ధానం అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఎంచుకున్నారు.
వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత, ఉత్పాదక వ్యయాల పెరుగుదల, వివాదాలు వంటి పలు అంతర్జాతీయ సవాళ్ల నేపధ్యంలో నిలకడైన వ్యవసాయ వృద్ధి అవసరాన్ని నొక్కిచెబుతూ ఈ సదస్సు సాగుతుంది. వ్యవసాయ పరిశోధన, విధానాల్లో భారత్ సాగిస్తున్న పురోగతి, అంతర్జాతీయ వ్యవసాయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే క్రమంలో దేశ సామర్ధ్యాన్ని ఈ సదస్సు హైలైట్ చేయనుంది.
అంతర్జాతీయ స్ధాయిలో యువ పరిశోధకులు, ప్రముఖ ప్రొఫెషనల్స్ పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ ప్రతిష్టాత్మక సదస్సు వేదిక కానుంది. పరిశోధన సంస్ధలు, విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో విధానాల రూపకల్పనలో ఈ సదస్సు కీలకంగా వ్యవహరిస్తుంది. భారత్‌లో సేద్యం కొత్తపుంతలు తొక్కిన క్రమాన్ని, వ్యవసాయ పురోగతిని అంతర్జాతీయ వేదికలపై చాటేందుకు ఈ సదస్సు ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :
Janhvi Kapoor | అలాంటి పాత్రలకు అస్సలు అంగీకరించను: జాన్వీకపూర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

