Free Ration | మరో ఐదేండ్లు ఉచిత రేషన్.. ఎన్నికల వేళ ప్రధాని మోదీ తాయిలాలు
Free Ration | త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో తాయిలం ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచిత ప్రకటన చేశారు.
Free Ration | దుర్గ్/రత్లాం, నవంబర్ 4: త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో తాయిలం ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచిత ప్రకటన చేశారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే లక్ష్యంతో ‘ఉచిత్ రేషన్’ స్కీమ్‌ను పొడిగించనున్నట్టు తాజాగా ప్రకటించారు.
పేదలకు మరో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు.
ఉచిత రేషన్ పొడిగింపును ‘మోదీ గ్యారంటీ’గా ఆయన చెప్పుకొన్నారు. ఈ పథకం పొడిగింపు వల్ల పేదలకు డబ్బు ఆదా ఆవుతుందని, వాటితో వేరే అవసరాలు తీర్చుకోవచ్చని అన్నారు. దుర్గ్ ర్యాలీ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ పేదలను పేదలుగానే ఉంచాలని అనుకుంటుందని ఆరోపించారు. మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధం, వారి నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందుతున్నాయని వస్తున్న ఆరోపణలు మోదీ ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

