6G | భారత్‌లో 6జీ నెట్‌వర్క్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్ధం చివరినాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగుతోందని ప్రధాని వెల్లడించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈవెంట్లో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
ఈ దశాబ్ధాంతానికి 6జీ సేవలు ప్రారంభించేందుకు మనం సన్నాహాలు చేపడతున్నామని ప్రధాని చెప్పారు. గేమింగ్, వినోద రంగాల్లో భారత సొల్యూషన్స్ కోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇక అంతకుముందు 5జీ సేవలు అక్టోబర్ 12 నాటికి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
టెలికాం ఆపరేటర్లు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఇన్స్టలేషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు షురూ అవుతాయని, ఆపై దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాయని అన్నారు. తొలుత హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూర్, గురుగ్రాం, లక్నో, కోల్‌కతా, ముంబై సహా 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

