PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi | ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్ (Mann Ki Baat) 122వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు.
PM Modi : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్ (Mann Ki Baat) 122వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని చెప్పారు. దేశ ప్రజలను ఆపరేషన్ సింధూర్ ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని పేర్లు పెట్టుకున్నారని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తిరంగా యాత్రలు నిర్వహించారని చెప్పారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు.
నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం ఇకపై కొనసాగుతుందని ప్రధాని స్పష్టంచేశారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి కూడా ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

