PM Modi: ముగిసిన 45 గంటల మోదీ ధ్యానం
PM Modi: ప్రధాని మోదీ ధ్యాన ముద్రను వీడారు. 45 గంటల పాటు చేసిన ధ్యానం నుంచి ఆయన బయటకు వచ్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌మెమోరియల్‌లో మోదీ ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన తమిళ కవి తిరువల్లూరుకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
కన్యాకుమారి: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కన్యాకుమారిలో ప్రధాని మోదీ(PM Modi) 45 గంటల పాటు ఏకాంత ధ్యానముద్రలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 45 గంటల పాటు ఆయన చేపట్టిన ధ్యానం ఇవాళ ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఆయన ధ్యానం చేశారు. గురువారం సాయంత్రం 6.45 నిమిషాలకు ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. ధ్యాన సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 45 గంటల పాటు మోదీ మౌనంగానే ఉన్నారు. కాషాయ దుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న మోదీ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ధ్యానంలో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయంలో ఆయన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం ధ్యానం ముగిసిన తర్వాత ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న తమిళ కవి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నమస్సుమాంజలి అర్పించారు.
#WATCH | PM Modi ends two-day-long meditation at Vivekananda Rock Memorial in Kanyakumari, Tamil Nadu pic.twitter.com/TY7snigzZI
— ANI (@ANI) June 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

