న్యూఢిల్లీ, ఆగస్టు 21 : యెమెన్, సోమాలియా తీరాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 22 మంది భారత జాతీయులతో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారని షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.
ఎరిత్రియా జెండా కలిగిన ‘ఎంటీ సిబు 1’ అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్‌ను ఈనెల 20న యెమెన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఏడెన్ గల్ఫ్‌లో సముద్రపు దొంగలు హైజాక్ చేశారని అ అధికారి తెలిపారు. ఈ ట్యాంకర్లో 16 మంది భారతీయులు, ఒక సిరియా జాతీయుడు, ఒక సూడాన్ జాతీయుడు, ఇరాన్ జాతీయుడు, ఒక నావికుడు సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. ఆరుగురు సాయుధ సముద్రపు దొంగలు ప్రస్తుతం నౌకలో ఉన్నారని, నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆ అధికారి చెప్పారు.