Kedarnath Temple: కేదార్‌నాథ్‌లో ఫోటోలు తీయడం నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
Kedarnath Temple: కేదార్‌నాథ్‌లో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో.. ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. రూల్స్ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని కమిటీ చెప్పింది.
రుద్రప్రయాగ్: కేదార్నాథ్ ఆలయ( Kedarnath Temple) పరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించింది. కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్టర్లను ఆలయం వద్ద పోస్టు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయడం కానీ, వీడియో రికార్డింగ్ కానీ చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లతో ఆలయ పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించరాదు అని, సీసీటీవీ కెమెరాల నిఘా ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
కేదార్నాథ్ ఆలయానికి వచ్చే భక్తులు వినమ్రంగా ఉండే దుస్తులు ధరించాలని, ఎందుకుంటే ఇటీవల కొన్ని అభ్యంతరకరమైన సంఘటనలు జరిగాయని, అందుకే కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర తెలిపారు. కొందరు భక్తుల ప్రవర్తన ఆమోదయోగ్యం లేదని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేందుకే వార్నింగ్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం వద్ద ఇటీవల ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ఆ వీడియో ఒకటి వైలర్ అయ్యింది. ఇంటర్నెట్లో దాని గురించి తీవ్ర చర్చ కూడా సాగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొన్నది. వీడియోలు, రీల్స్‌పై దృష్టి పెట్టడం వల్ల మత పవిత్రత దెబ్బతీనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

