న్యూఢిల్లీ: ఫోన్‌పే యాప్ డెవలపర్ల కోసం మొబైల్ యాప్ స్టోర్‌ను తెరిచింది. ఇప్పటివరకు గూగుల్, యాపిల్ సంస్థలు మాత్రమే యాప్ స్టోర్ రంగంలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు ఇంగ్లిష్ సహా 12 భారతీయ భాషల్లో యాప్‌లను తమ స్టోర్‌లో ఉంచవచ్చని ఫొన్‌పే ఆహ్వానం పలికింది. యాప్‌లు నిర్వహించే అమ్మకాలపై చార్జి ఉండదని ప్రకటించింది. గూగుల్, యాపిల్లు 15-30 శాతం లెవీ వసూలు చేస్తున్నాయి.