విద్వేష వ్యాఖ్యలపై రగడ : ఆలయంపై పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో హింసాత్మక నిరసనలు జరిగిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆలయంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు.
రాంచీ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో హింసాత్మక నిరసనలు జరిగిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆలయంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. సూర్య మందిర్ ఆలయం లోపలికి నాలుగు పెట్రోల్ బాంబులు విసిరిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పూజారి తన కుటుంబ సభ్యులతో పాటు నిద్రిస్తున్నారు.
ఆలయంలో పెట్రోల్ బాంబులు విసరడంతో పూజారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి నుంచి తమకు నిద్ర కరవైందని చెప్పారు. దోషులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు నూపుర్ శర్మ వ్యాఖ్యలపై రాంచీ నగరంలో ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నూపుర్ శర్మపై కఠిన చర్యలు చేపట్టాలని ప్లకార్డులను ప్రదర్శంచారు.
పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో నిరసనకారులు పోలీసులప రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఘర్షణలో గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మరణించారని ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. హింసాత్మక ఘటనలతో రాంచీలో నిషేధాజ్ఞలు జారీ చేసిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

