Nitish Kumar | జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్, పార్టీ చీఫ్‌గా నితీశ్ కుమార్ ఎన్నిక కావడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్, పార్టీ చీఫ్‌గా నితీశ్ కుమార్ ఎన్నిక కావడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ(9)కు అనుగుణంగా ఆయన ఎన్నిక జరుగలేదని ఆరోపించారు.
కాగా, జస్టిస్ పుష్పేందర్ కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం ఆగస్ట్ 29న ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలు విచారణ పరిధికి పూర్తి దూరంగా ఉన్నాయని తెలిపింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ పిటిషన్‌కు వర్తించవని పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. పిటిషన్ మెరిట్ లేనిదిగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దానిని డిస్మిస్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

