Snoring | న్యూఢిల్లీ: గురకపెట్టి నిద్రపోవటం సర్వసాధారణమైందిగా భావిస్తాం. కానీ బయటకు కనిపించని అనేక ఆరోగ్య సమస్యలకు ఇదొక సూచిక అని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.
గురకపెట్టి నిద్రపోతున్న వాళ్ల డాటాను సేకరించిన పరిశోధకులు, గురకకు.. వివిధ అనారోగ్య సమస్యలకు ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. గురక పెట్టే వాళ్లకు బీపీ, డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.