CJI | ఓటువేసే అవకాశాన్ని కోల్పోవద్దు.. : సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ పిలుపు
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు.
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని.. రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందన్నారు.
అయితే, ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమన్నారు. గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించవచ్చని.. గర్వంగా ఓటు వేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు’ అని రాసుందన్నారు.
ఈ సందర్భంగా సీజేఐ ఆయన తొలిసారిగా ఓటరుగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందన్నారు. న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో ఓటు వేయడంలో విఫలం కాలేదన్నారు. దేశ పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఓటింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడవడనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

