railway station | రైల్వే స్టేషన్‌లోని టీవీల్లో అశ్లీల వీడియోలు.. షాకైన ప్రయాణికులు
railway station | రైల్వే అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. దత్తా కమ్యూనికేషన్‌పై చర్యలు చేపట్టారు. ఆ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా రైల్వే అధికారులు విధించారు. ప్రకటనల కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.
పాట్నా: రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై అశ్లీల వీడియోలు కనిపించాయి. దీంతో ఇది చూసిన ప్రయాణికులు షాకయ్యారు. బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం పది గంటలకు ఆ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 10పై ఉన్న టీవీల్లో యాడ్స్‌తోపాటు మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయ్యింది. ఇది గమనించిన ప్రయాణికులు కంగుతిన్నారు. కొందరు వెంటనే గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు. పాట్నా రైల్వే స్టేషన్లలోని టీవీల స్క్రీన్లపై ప్రకటనల బాధ్యతలు చూసే దత్తా కమ్యూనికేషన్‌ను సంప్రదించారు. పోర్న్ క్లిప్ ప్రసారాన్ని ఆపాలని ఆ ఏజెన్సీ నిర్వాహకులను కోరారు. దీంతో మూడు నిమిషాల తర్వాత అశ్లీల వీడియో క్లిప్ ప్రసారం నిలిచిపోయింది.
మరోవైపు రైల్వే అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. దత్తా కమ్యూనికేషన్‌పై చర్యలు చేపట్టారు. ఆ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా రైల్వే అధికారులు విధించారు. ప్రకటనల కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. రైల్వే కూడా ఈ సంఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. కాగా, కొందరు ప్రయాణికులు ఈ అశ్లీల వీడియో క్లిప్ ప్రసారాన్ని
తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో క్లిప్‌లు వైరల్ అయ్యాయి.
Also Read:
Watch | వరమాల సమయంలో జారిన వరుడి పైజామా.. వధువు ఎలా స్పందించిందంటే!
Watch | పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

