నేటి నుంచి పార్లమెంట్… వాడీ వేడిగా సాగనున్న శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పనిదినాలు ఉంటాయి.
- సర్, దేశ భద్రతపై అధికార పక్షాన్ని నిలదీయనున్న విపక్షాలు
- ఈ సమావేశాల్లో 14 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
- తొలిసారిగా రాజ్యసభకు అధ్యక్షత వహించనున్న రాధాకృష్ణన్
న్యూఢిల్లీ, నవంబర్ 30: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పనిదినాలు ఉంటాయి. సాధారణంగా ఇవి 20 ఉండేవి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)తో పాటు, ఇటీవల హఠాత్తుగా తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, అణు ఇంధన రంగం ప్రైవేటీకరణ, రైతులకు కనీస మద్దతు ధర, కొత్తగా ఏర్పాటవుతున్న ఉన్నత విద్యా కమిషన్ తదితర అంశాలపై అధికార బీజేపీని నిలదీయడానిక విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశాల్లో కేంద్రం 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. పలు సంస్కరణల అజెండాను మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. వీటిలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం-రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. చండీగఢ్‌ను అధికరణం 240 పరిధిలోకి తెచ్చే 131 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడదామనుకున్నప్పటికీ విపక్షాల నిరసనతో కేంద్రం వెనకడుగు వేసింది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో అనూహ్య పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ నేతృత్వంలో తొలిసారిగా రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి.
సమగ్ర చర్చ జరగాలి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇవి శీతాకాల సమావేశాలు కాబట్టి సభ్యులు వాడీ వేడి వాదనలకు దిగకుండా కూల్ మైండెడ్‌గా ఉంటారని ఆశిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సమావేశాలు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం తదితర పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం చేపట్టిన సర్, ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో జాతీయ భద్రత తదితర అంశాలపై సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఢిల్లీ పేలుడు ఘటన జరిగిన క్రమంలో జాతీయ భద్రతపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుతున్నామని, పార్లమెంట్ సమావేశాల్లో అంతరాయం ఏర్పడితే దానికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం ఎంపీ బ్రిట్టాస్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో అమలవుతున్న విదేశాంగ విధానం పట్ల కాంగ్రెస్ నేత, లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల ఆధారంగా మన విదేశాంగ విధానం ఏర్పడటాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా, అంతకు ముందు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా మారుతున్న వాయు కాలుష్యం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
సిగరెట్, పాన్ మసాలాలపై హెల్త్, సెక్యూరిటీ సెస్
జీఎస్టీ కింద ఇప్పటివరకు విధిస్తున్న కాంపన్సేషన్ సెస్ త్వరలో ముగియనుండటంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులపై పన్ను తగ్గకుండా ఉండేందుకు కేంద్రం కొత్త హెల్త్, సెక్యూరిటీ సెస్‌ను పెట్టాలని యోచిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ‘హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు, 2025ను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు సెంట్రల్ ఎక్సైజ్ చట్టంలో సవరణ తేనున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై ఉన్న కాంపన్సేషన్ సెస్ త్వరలో ముగియనుంది. దీంతో ఈ ఉత్పత్తులపై పన్ను భారం ఇప్పటిలాగే ఎక్కువగా ఉంచేందుకు హెల్త్, సెక్యూరిటీ సెస్ విధించనున్నారు..
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటి వినియోగం తగ్గించడం, ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా చూడటం, ఈ ఉత్పత్తులపై పన్ను తగ్గకుండా చూసే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కాగా, జీఎస్టీ పన్ను గరిష్ట శాతాన్ని మించి కొన్ని వస్తువులకు పన్ను విధించడాన్నే జీఎస్టీ పరిభాషలో కాంపన్సేషన్ లెవీ అంటారు. కొన్ని విలాస, సిన్ వస్తువులు (సిగరెట్, గుట్కా వంటివి)పై ఇలా అదనపు పన్ను విధించే అధికారం కేంద్రానికి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

