Parliament monsoon session | జులై మూడో వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Parliament monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Parliament monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జులై 17 లేదా 20వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 10న ముగియవచ్చని తెలిపాయి. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయా? లేక ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతాయా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజులక్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే.. పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశాల్లో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది.
Also Read..
Madhya Pradesh | నదిలో బోల్తాపడిన పెళ్లి వాహనం .. ఐదుగురు మృతి.. పలువురు చిన్నారులు మిస్సింగ్
Asin | ఇందు కోసం 5 నిమిషాల సమయం వృధా.. విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన గజినీ భామ
Ford Layoff | ఉద్యోగులకు షాకిచ్చిన ఫోర్డ్.. 3 వేల మందిపై వేటు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

