Love Marriage | న్యూఢిల్లీ, జూలై 31: పిల్లల ప్రేమ వివాహానికి వారి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ఓ వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. దీనిపై సర్కార్ బిల్లు తీసుకొస్తే మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది.
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లలు ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తేవాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. మెహసానాలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలన్న అంశానికి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తాం’ అని చెప్పారు.