Facebook | న్యూఢిల్లీ, జూన్ 27: మీ పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారా? అందులో వారు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసమే సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్టు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మంగళవారం వెల్లడించింది.
ఇకపై పిల్లల సామాజిక మాధ్యమాలపై తల్లిదండ్రులు నిఘా పెట్టవచ్చు. వారు ఎంత సేపు సోషల్ మీడియాలో గడుపుతున్నారో తెలుసుకోవచ్చు. దీంతో పాటు పిల్లలు సోషల్ మీడియాలో ఎంత సమయాన్ని గడపాలో నిర్ణయించి, పరిమితులను కూడా తల్లిదండ్రులే విధించవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మెస్సేజ్‌లను తల్లిదండ్రులు చూసేందుకు వీలు ఉండదు.