West Bengal Panchayat Elections: అంతా రచ్చ రచ్చ.. పోలింగ్ బూత్‌లో బ్యాలెట్లకు నిప్పు.. గవర్నర్‌ను అడ్డుకున్న స్థానికులు
West Bengal Panchayat elections: పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో విధ్వంసం చోటుచేసుకున్నది. కూచ్‌బిహార్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ పత్రాలకు నిప్పుపెట్టారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌ను పార్గనాస్ జిల్లాలో అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను హత్య చేసినట్లు టీఎంసీ ట్వీట్ చేసింది.
కూచ్‌బిహార్: పశ్చిమ బెంగాల్(West Bengal)లో ఇవాళ పంచాయితీ ఎన్నికలు(Panchayat Elections) జరగుతున్నాయి. కూచ్ బిహార్‌లోని సితాయిలో ఉన్న బారావిటా ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పుపెట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
మరోవైపు నార్త్ 24 పార్‌గనాస్‌లో ఉన్న పోలింగ్ బూత్‌కు వెళ్తున్న సమయంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ను స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ మద్దతుదారులు ఆయన్ను నిలదీశారు. వాహనాన్ని ఆపిన ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.
అన్ని జిల్లాల్లోనూ ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు క్యూలైన్ కట్టారు. పుర్బా మిడ్నిపుర్ జిల్లాలోని నందిగ్రామ్ బ్లాక్‌లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలను వెనక్కి పంపాలని వాళ్లు డిమాండ్ చేశారు.
ముర్షీదాబాద్‌లో జరిగిన హింసలో 52 ఏళ్ల టీఎంసీ కార్యాకర్త సతీశుద్దిన్ షేక్ హత్యకు గురయ్యాడు. పోస్టు మార్టమ్ నిమిత్తం అతని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. రేజినగర్, తుఫాన్‌గంజ్, ఖర్గ్రామ్ పట్టణాల్లో ముగ్గురు పార్టీ కార్యకర్తలను హత్య చేశారని టీఎంసీ ట్వీట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

