వాట్సాప్‌లో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్
డిజీలాకర్‌లో దాచుకొన్న డిజిటల్ పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాంటి డాక్యుమెంట్లను ఇక నుంచి వాట్సాప్‌లో కూడా పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో మైగవ్ హెల్ప్‌డెస్క్ నంబర్ 9013151515కు
9013151515కు ‘నమస్తే’ అని మెసేజ్ చేస్తే డిజీలాకర్ సేవలు
న్యూఢిల్లీ, మే 23: డిజీలాకర్‌లో దాచుకొన్న డిజిటల్ పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాంటి డాక్యుమెంట్లను ఇక నుంచి వాట్సాప్‌లో కూడా పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో మైగవ్ హెల్ప్‌డెస్క్ నంబర్ 9013151515కు ‘డిజీలాకర్/నమస్తే/హాయ్’ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది.
మీ డిజీ లాకర్ అకౌంట్లో ఉన్న డిజిటల్ డాక్యుమెంట్లు వాట్సాప్‌లో కనిపిస్తాయి. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. డిజీలాకర్ ఖాతా లేనివాళ్లు వాట్సాప్‌లోనే ఖాతాను తెరవడానికి అవకాశం కల్పించింది. ‘ఇప్పుడు వాట్సాప్ నుంచి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, మార్కుల మెమోలు, ఇన్సూరెన్స్ పాలసీల డిజిటల్ డాక్యుమెంట్లు పొందవచ్చు’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రభుత్వ సేవలు సులభంగా, పారదర్శకంగా పొందేందుకు దీన్ని రూపొందించినట్టు తెలిపింది. డిజీలాకర్‌లో ఇప్పటికే 10 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

