ఉరీ సెక్టార్లో అక్రమ చొరబాటుకు పాక్ ఉగ్రవాదుల విఫలయత్నం..
Uri sector | జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. గురువారం ఉదయం బారాముల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. గురువారం ఉదయం బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో నియంత్రిణ రేఖ వెంబడి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. మదియన్ నానక్ పోస్ట్ సమీపంలోని కంచెను దాటినవారు భారత భూభాగంలోకి చొరబడుతున్నారని గుర్తించిన భద్రతా సిబ్బంది.. వారిని నిలువరించడానికి కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కశ్మీర్‌జోన్ పోలీసులు తెలిపారు.
అనంతరం ఆ ప్రాంతంలో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనీస్ ఎం 16 తుపాకీ, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ పరికరాలను ఉపయోగించి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను గుర్తించామన్నారు. ఆ వీడియోను ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసింది.
#WATCH | Pakistani terrorists were trying to infiltrate into India from Uri sector on Aug 25. The terrorists were detected by electronic surveillance gadgets after specific intelligence inputs were received. 3 terrorists were eliminated by alert Army troops: Indian Army officials pic.twitter.com/ObsQ4eXQy5
— ANI (@ANI) August 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

