గుజరాత్ తీరంలో పట్టుపడిన పాక్ బోట్.. రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
Pakistani boat | గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముంద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముంద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకున్నాయి. అందులో రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముంద్రంలో చేపలు పట్టే పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు కోస్టుగార్డు, ఏటీఎస్ సిబ్బంది గుర్తించారు. సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆరుగురు పాకిస్థానీలను అరెస్టుచేయడంతోపా బోటును సీజ్ చేశారు. సముద్రమార్గం ద్వారా మాదక ద్రవ్యాలను గుజరాత్ తీసుకొచ్చి.. అటునుంచి రోడ్డుమార్గంలో పంజాబ్ తరలించాలనుకున్నారని అధికారులు వెల్లడించారు.
Indian Coast Guard & ATS Gujarat jointly apprehended a Pakistani Boat with 6 crew in Indian waters carrying approx 40 kgs of Heroine worth Rs 200 crores: Indian Coast Guard https://t.co/HQxRIMJNNe pic.twitter.com/yY705W2lKP
— ANI (@ANI) September 14, 2022
గతేడాది అక్టోబర్‌లో గుజరాత్ మంద్రాపోర్టులో పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. రూ.21 వేల కోట్ల విలువైన 2988 కిలోల మత్తుమందును అధికారులు సీజ్ చేశారు. గత నెలలో కచ్ జిల్లాలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థానీ చేపల బోటును బీఎస్ఎఫ్ సైనికులు పట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

