Pakistan | ఒప్పందం కుదిరిన గంటల్లోనే కాల్పుల విరమణకు పాక్ తూట్లు.. మూడు రాష్ర్టాల్లో డ్రోన్ దాడులు
Pakistan | కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ ఒప్పంద ఉల్లంఘనకు తెగబడింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక నగరాలపై డ్రోన్ల దాడి కొనసాగింది.
Pakistan |జమ్ము, మే 10: కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ ఒప్పంద ఉల్లంఘనకు తెగబడింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక నగరాలపై డ్రోన్ల దాడి కొనసాగింది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పూర్తి స్థాయిలో ఎదుర్కొనాలని బీఎస్ఎఫ్ను ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్‌తోసహా జమ్ము కశ్మీర్‌లోని అనేక చోట్ల పేలుళ్లు సంభవించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు రోజుల్లో ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా పేర్కొన్నాయి. కశ్మీర్‌లోని బారాముల్లాతోపాటు రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో పాకిస్థానీ డ్రోన్లను భారత భద్రతాదళాలు కూల్చివేశాయి. శ్రీనగర్‌తోపాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం రాత్రి విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేసి బ్లాకౌట్ విధించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెండి అఖ్నూర్, రాజౌరీ, ఆర్ఎస్ పురా సెక్టార్లలో పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. జమ్ముకు చెందిన పలన్వాలా సెక్టార్లో ఎల్ఓసీ వెంబడి కూడా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. బారాముల్లాలో భారత దళాలు ఓ డ్రోన్‌ను పేల్చివేశాయి. బారాముల్లాలోనే అనుమాస్పద మానవరహిత గగనతల వాహనాలు(యూఏవీలు) కనిపించాయి.
సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో బ్లాకౌట్ విధించారు. బారాముల్లా, శ్రీనగర్‌లో బ్లాకౌట్ అమలుచేశారు. మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల బేస్ క్యాంపు కాట్రాలో కూడా బ్లాకౌట్ అమలు చేశారు. పంజాబ్‌లోని జలంధర్, లూథియానాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు ముందు జాగ్రత్తగా బ్లాకౌవుట్ విధించారు. జమ్ము ప్రాంతంలోని సాంబా జిల్లాలో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరిక సైరన్లు మోగాయి.

శనివారం కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శ్రీనగర్ గగనతలంలో పాక్ డ్రోన్లు
నగ్రోటా మిలిటరీ బేస్‌పై కాల్పులు
నగ్రోటా మిలిటరీ స్టేషన్లో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు చొరబడి కాల్పులు జరిపినట్టు భారత సైన్యం ప్రకటించింది. సెంట్రీ స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. చొరబడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొంది.
పేలుళ్ల శబ్దాలు వినిపించాయి: ఒమర్
భారత్‌తో కాల్పుల విరమణకు పాకిస్థాన్ అంగీకరించిన కొన్ని గంటల్లోనే శ్రీనగర్‌లో పేలుళ్లు శబ్దాలు వినిపించాయని జమ్ము కశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎల్ఓసీ వెంబడి కవ్వింపు కాల్పులకు పాకిస్థాన్ పాల్పడుతోందని ఆయన తెలిపారు. కాల్పుల విరమణకు ఏం జరిగింది? శ్రీనగర్వ్యాప్తంగా పేలుళ్లు వినపడుతున్నాయి’ అని ఎక్స్ పోస్టులో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండగా శ్రీనగర్‌కు చెందిన వీడియోను కూడా షేర్ చేశారు. ‘కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న గగనతల రక్షణ యూనిట్లు ఇప్పుడే తెరుచుకున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

