ముంబై ఎస్బీఐ బ్యాంక్‌ను పేల్చేస్తాం.. పాకిస్తానీ బెదిరింపు కాల్
Mumbai SBI Bank | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఎస్బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని, బ్యాంక్ మేనేజర్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఎస్బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని, బ్యాంక్ మేనేజర్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాను పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు ఎండీ జియా ఆల్ అలిమ్ అని బ్యాంకు అధికారులకు పరిచయం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు లోన్ ఇవ్వాలని, లేని పక్షంలో బ్యాంక్ చైర్మన్‌ను కిడ్నాప్ చేసి హతమారుస్తానని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవసరమైతే బ్యాంకును కూడా పేల్చేస్తానని ఆ వ్యక్తి బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు.
అయితే సదరు వ్యక్తి అక్టోబర్ 13వ తేదీన ఉదయం 11 గంటలకు బ్యాంకు ల్యాండ్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసినట్లు తేలింది. బ్యాంక్‌కు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

