న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశీయ హోటల్ అగ్రిగేటర్ ఓయో.. మొత్తం 3,700 మంది ఉద్యోగుల్లో దాదాపు 600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్, ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఓయో గదుల కేటాయింపు సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సంస్థలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించింది.
షేర్‌చాట్ ‘ఫాంటసీ గేమింగ్ జెట్ 11’ను మూసివేస్తున్నది. 2,300 మంది ఉద్యోగుల్లో 5% మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా టెక్నికల్ ఉద్యోగులను తొలగిస్తున్నారు.