Kolhapur Clashes | ఫడ్నవీస్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఘర్షణల (Kolhapur Clashes) నేపధ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఔరంగజేబు వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
హైదరాబాద్ : మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఘర్షణల (Kolhapur Clashes) నేపధ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఔరంగజేబు వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. నాథూరామ్ గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టేల సంతానం ఎవరో వారికి తెలుసా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ పోస్టులను కొందరు స్టేటస్‌గా పెట్టుకోవడంతో కొల్హాపూర్‌లో ఇరు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన నేపధ్యంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఓవైసీ తప్పుపట్టారు.
మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో హఠాత్తుగా ఔరంగజేబు కొడుకులు పుట్టుకొచ్చారు… వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టుకుని వారి పోస్టర్స్ చూపుతుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి..ఔరంగజేబు కొడుకులు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారు..దీని వెనుక ఎవరున్నారని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఓవైసీ ఆక్షేపిస్తూ మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఔరంగజేబు సంతానం గురించి మాట్లాడుతున్నారు..మీకు అంతా తెలుసా? మీకు అంత పరిజ్ఞానం ఉందని నేననుకోను..మరి గాడ్సే, ఆప్టేల సంతానం ఎవరో మీకు తెలుసా…వారు ఎవరని నిలదీశారు. కాగా, కొల్హాపూర్ అల్లర్లపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు.
యూపీ తరహాలో సంఘ విద్రోహ శక్తులను కాల్చిపారేయాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 6న ఇద్దరు వ్యక్తులు టిప్పు సుల్తాన్ ఫొటోతో పాటు ఆడియో మెసేజ్‌ను సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టుకోవడం ఘర్షణలకు దారితీయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. గత పదేండ్లుగా మతపరమైన రాజకీయాలు ప్రబలంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రమాదంలో పడుతున్నదని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట ఎంతలా మసకబారిందో తెలుస్తోందని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు కొల్హాపూర్ ఘర్షణలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు.కొందరు వ్యక్తులు చేసిన పని ఈ పరిస్ధితికి దారితీయడం దురదృష్టకరమని అన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని, అల్లర్ల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More
Currency notes | కరెన్సీపై బీజేపీ సర్కారు క్లినికల్ ట్రయల్స్.. ఎప్పుడు ఏ నోటు పోతుందోనని భయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

