Yogi Adityanath | యూపీలో సార్వత్రిక ఫలితాలపై యోగి కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే..?!
Yogi Adityanath | సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం వల్లే తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Yogi Adityanath | సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం వల్లే తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయితే ఇంతకుముందు వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం మాత్రమే పొందిందని బీజేపీ యూపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో బీజేపీ సమర్థవంతంగా పని చేసింది. 2014 నుంచి ఇటీవలి వరకు జరిగిన ఎన్నికల్లో విపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నాం. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. అదే ఓట్ల శాతంతో 2024లోనూ మరోమారు గెలుపొందింది. అయితే ఈసారి గణనీయ మార్పు కనిపించింది. గత ఎన్నికల ఓట్ల శాతం పొందినా, ప్రతిపక్షాలకు కూడా ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. విజయంపై అతి విశ్వాసమే దీనికి కారణం అనడంలో సందేహం లేదు’ అని యోగి చెప్పారు.
తమ ప్రభుత్వం యూపీలో శాంతిభద్రతలను పరిరక్షిస్తుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. హింసను సృష్టించాలని విపక్షాలు ప్రయత్నించినా డబుల్ ఇంజిన్ సర్కార్.. వారి ఎత్తులను తిప్పి కొట్టిందని చెప్పారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 10 సీట్లు గెలుచుకుంటే బీజేపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవడం ఆసక్తి కర పరిణామం.
ఇవి కూడా చదవండి :
Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్‌యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
CRISIL- Crude Oil | క్రూడ్ ధరతో ప్రభుత్వ ఖజానాపై ద్రవ్యలోటు భారం తప్పదా.. క్రిసిల్ ఆందోళన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

