ఐఐటీ మద్రాస్‌లో మరో 13 మందికి కరోనా… 196కు చేరిన సంఖ్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 13 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 196కు పెరిగింది. కరోనా వ్యాప్తి కేంద్రంగా ఐఐటీ మద్రాస్ మారడం కలకలం రేపుతున్నది. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేవని అక్కడి అధికారులు తెలిపారు. కొందరికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలున్నట్లు చెప్పారు.
కాగా, ఇప్పటి వరకు 7,300 నమూనాలను పరీక్షించగా 196 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఐఐటీ మద్రాస్ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిని ఐసొలేషన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఐసొలేషన్ కాలం ముగిసి టెస్ట్‌లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 33 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు.
మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో కరోనా బారిన పడిన విద్యార్థులకు క్యాంపస్‌లోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- IIT Madras
- New cases
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

