PENDING CASES| హైకోర్టుల్లో 30 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 71వేలకుపైగా కేసులు.. కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది.
PENDING CASES| న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. మరోవైపు డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య ఐదు కోట్ల మార్క్‌ను దాటినట్టు తెలిపారు.
సుప్రీంకోర్టులో జూలై 1 నాటికి 69,766 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. హైకోర్టుల్లో 60,62,953 కేసులు, డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 4,41,35,357 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కేసులు పేరుకుపోవడానికి కేవలం న్యాయమూర్తుల కొరత ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేసుల్లో సంక్లిష్టత, బార్, దర్యాప్తు సంస్థలు, సాక్షులు, కక్షిదారులు తదితర భాగస్వామ్యపక్షాల సహకారం వంటి అంశాలు కూడా కేసుల పెండింగ్‌కు కారణమని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

