Bypolls results | ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్..
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగాను నాలుగు స్థానాల్లో విజయం సాధించింది.
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగాను నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.
కాగా, త్రిపురలోని బోక్సానగర్, ధన్పూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తఫజ్జల్ హొస్సేన్, బిందు దేబ్నాథ్ 30,237, 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పార్వతి దాస్, కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్‌పై 2,400 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మరోవైపు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ జూలైలో మరణించారు. 50 ఏండ్లుగా ఆయన పోటీ చేసిన పుతుపల్లి స్థానం నుంచి కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ గెలిచారు. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం అభ్యర్థి జైక్ సి థామస్‌పై 36,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తండ్రి కంటే రికార్డు స్థాయిలో మెజార్జీ సాధించారు.
కాగా, ‘ఇండియా’ కూటమికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థిని బేబీ దేవి, డుమ్రీ ఉపఎన్నికల్లో గెలిచారు. ప్రత్యర్థి పార్టీ ఏజేఎస్యూకు చెందిన యశోదా దేవిపై 17,000కుపైగా మెజార్టీతో గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ధూప్‌గురి స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కుకున్నది. బీజేపీ అభ్యర్థి తాపసి రాయ్‌పై టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్రా రాయ్ 4,300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ స్థానంలో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్, బీజేపీ అభ్యర్ధి దారా సింగ్ చౌహాన్‌పై 42,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- battle
- BJP
- Bypolls results
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

