Presidential Election | రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి పేరు ఖరారు చేయడానికి ఈ నెల 21న విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు సమాచారం.
బుధవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలుపాలని నిర్ణయించారు.ఇప్పటికే శరద్ పవార్‌ను పోటీ చేయాలని విపక్షాలు కోరినా ఆయన నిరాకరించినట్లు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి కోసం ఏకాభిప్రాయ సాధనకు మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవున్న సందర్భంగా భారత ప్రజాస్వామ్య, సామాజిక వ్యవస్థకు నష్టం కలుగకుండా మోదీ సర్కార్‌ను నిలువరించడానికి భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండే వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని ఈ భేటీ నిర్ణయించింది.