మోదీ సర్కార్ మొండివైఖరితోనే పార్లమెంట్లో ప్రతిష్టంభన

న్యూఢిల్లీ : పార్లమెంట్లో పెగాసస్ వివాదం సహా పలు అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొందని విపక్షాలు బుధవారం ఆరోపించాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టి హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని విపక్షాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. పెగాసస్ వ్యవహారంతో పాటు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కూడా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి.
పార్లమెంట్ కార్యకలాపాలను విపక్షాలు స్తంభింపచేస్తున్నాయని మోదీ సర్కార్ దుష్ప్రచారం సాగిస్తోందని భగ్గుమన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిపి హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల సమస్యలు, వివాదాస్పద సాగు చట్టాల పైనా పార్లమెంట్లో చర్చ జరగాలని స్పష్టం చేశాయి. విపక్షాల సంయుక్త ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జన్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా పలు పార్టీలకు చెందిన విపక్ష నేతలు సంతకాలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

