Sonia Meeting : మోదీకి చెక్ పెట్టేందుకు విపక్షాల సన్నాహాలు
Sonia Meeting : 2024 పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు విడివిడిగా కలివిడిగా సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం...

న్యూఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు విడివిడిగా కలివిడిగా సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తానని చెప్పిన మమతా బెనర్జీ.. అన్నట్లుగానే వారం క్రితం ఢిల్లీ వచ్చి పలువురు నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్లో ఐక్యంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టిన విపక్షాలు.. తమ ఐక్యత ఇదీ అని చూపకనే చూపాయి. ఇదే వేడిలో సోనియాగాంధీ (Sonia Meeting) కూడా విపక్షాలతో భారీ వర్చువల్ సమావేశానికి తెరలేపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై బీజేపీ నాయకులు చేసిన దాడులు, కుట్రలకు ఆగ్రహంగా ఉన్న మమతా బెనర్జీ.. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో ఉన్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి పీఠం అధిష్ఠించగానే సీఎస్‌ను కేంద్రానికి సరెండర్ చేయకుండా అడ్డుకున్నది. ఆయనతో సీఎస్ పదవికి రాజీనామా చేయించి ప్రధాన సలహాదారుగా నియమించుకుని కేంద్రంలోని మోదీ సర్కార్‌పై పైచేయి సాధించింది. తన పార్టీని వీడి తనపైనే పోటీ చేసి ఓడించిన సువేందు అధికారిపై పాత కేసులు బయటకు తీయించింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరుకుని తన అస్త్రాలకు పదును పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ముఖ్యనాయకులను కలుసుకుని బీజేపీపై సమరశంఖం పూరించింది.
బలమైన కూటమికి సోనియమ్మ యత్నాలు
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 20 న విపక్ష పార్టీల నేతలో వర్చువల్ సమావేశం జరిపేందుకు సిద్ధమయ్యారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలతోపాటు ప్రతిపక్ష నాయకులతో భారీ సమావేశాన్నే ప్లాన్ చేశారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లను కూడా ఆహ్వానించారు. ప్రతిపక్షాల ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ సమావేశం వేదికను వాడుకోనున్నారు.
విపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల వరకు ఈ వేడిని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహంపై ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు మద్ధతుగా నిలుస్తాయనే వీరి భేటీలో వచ్చే చర్చలను బట్టి ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సిద్ధం చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. అలాగే, వచ్చే ఏడాది యూపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
మమత, పవార్‌లతో షురూ..
తొలుత మమతా బెనర్జీ, ఆ తర్వాత శరద్ పవార్ కూడా విపక్ష నేతలతో భేటీలు జరిపారు. మరోవైపు, కపిల్ సిబాల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 10 వ తేదీన తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేసి పలు పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంకలు మాత్రం హాజరుకాలేదు. ఈ డిన్నర్‌కు శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్, డెరెక్ ఓ బ్రియాన్, ఓమర్ అబ్దుల్లాలు హాజరయ్యారు. బీజేపీతో నిన్నటివరకు అంటకాగిన అకాళీదల్‌ను కూడా డిన్నర్‌కు పిలిచారు. నవీన్ పట్నాయక్ పిలిచినా గైర్హాజరయ్యారు.
వర్షాకాల సమావేశాల్లో కనిపించిన ఐక్యత
పెగాసస్ గూఢచర్యం కుంభకోణం, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై గందరగోళాన్ని సృష్టించడాన్ని కొనసాగిస్తూ వర్షాకాల సమావేశాల్లో 15 కు పైగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఐక్య ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. గందరగోళం కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం ఏర్పడింది. చర్చ లేకుండానే అనేక బిల్లులు సభలో ఆమోదించబడ్డాయి. రాహుల్‌గాంధీ కూడా వీరి దారిలోనే నడిచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగానే.. 17 పార్టీల నేతలకు లంచ్‌కు పిలిచారు. ఈ సమావేశానికి బీఎస్పీ, ఆప్ నేతలు హాజరుకాలేదు.
రేపు మహా పాదయాత్ర..?
పార్లమెంట్‌ను ప్రతిష్ఠింభజేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ సహా విపక్షాలు సఫలం చెందాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడ్తూ గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి విక్టరీ స్క్వేర్ వరకు 15 ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మహా పాదయాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. రాజ్యసభలో తొలిసారిగా ఎంపీలపై దాడిచేసి కొట్టారని రాహుల్ ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.
ఇవి కూడా చదవండి..
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

