Encounter | శ్రీనగర్‌లో విదేశీ ఉగ్రవాది హతం..! ఖన్యార్‌లో కొనసాగుతున్న కాల్పులు
Encounter | శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని సైన్యం ఐఈడీ పేల్చి వేసింది. ఆ తర్వాత ఇల్లంతా పొగతో నిండిపోయింది.
Encounter | శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని సైన్యం ఐఈడీ పేల్చి వేసింది. ఆ తర్వాత ఇల్లంతా పొగతో నిండిపోయింది. అయితే, ప్రస్తుతం ఓ విదేశీ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తున్నది. ఇంట్లోనే ఇంకా పలువురు ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం నుంచి బందిపొరలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తున్నాయి. ఆపరేషన్ సమయంలో సైన్యం రెండు బ్యాక్‌ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. స్థానికులు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ఇక అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది దాక్కున్నాడని.. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలంలో భద్రతా బలగాలు నిఘాను కట్టుదిట్టం చేశాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
#WATCH | Jammu and Kashmir: A plume of smoke billows into the sky in Srinagar. Gunshots can be heard in the background as an encounter is underway between security forces and terrorists in the Khanyar area of Srinagar.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/liSbElpyZi
— ANI (@ANI) November 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

