Manipur | మణిపూర్ యూనివర్సిటీలో బాంబు పేలుడు.. వ్యక్తి మృతి
Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది.
Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 9:25 గంటల ప్రాంతంలో కార్యాలయం తూర్పు వైపున గుర్తుతెలియని దుండగులు బలమైన బాంబును పేల్చినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ ఘటనలో ఓయినమ్ కెనెగి (24), సలామ్ మైఖేల్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు.
వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఓయినమ్ కెనెగి ప్రాణాలు కోల్పోయినట్లు వారు వెల్లడించారు. మైఖేల్ మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Godzilla x Kong | యాక్షన్ ప్యాక్డ్గా ‘గాడ్జిల్లా అండ్ కాంగ్’ తెలుగు ట్రైలర్
Encounter | సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
Trinamool Congress: 42 సీట్లలో మేమే పోటీ చేస్తాం: తృణమూల్ కాంగ్రెస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

