Godzilla x Kong | యాక్షన్ ప్యాక్డ్గా ‘గాడ్జిల్లా అండ్ కాంగ్’ తెలుగు ట్రైలర్
Godzilla x Kong | హలీవుడ్ నుంచే వచ్చే గాడ్జిల్లా చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి.
Godzilla x Kong | హలీవుడ్ నుంచే వచ్చే గాడ్జిల్లా చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి. మాన్స్టర్ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 4 సినిమాలు రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా రాబోతుంది.
గాడ్జిల్లా అండ్ కాంగ్: ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong The New Empire) అంటూ ఈ సినిమా రానుండగా.. ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. కింగ్ కాంగ్ జాతికి చెందిన కొన్ని జంతువులు భూమి మీద వినాశనం సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే అవి అధిక సంఖ్యలో ఉండటంతో కాంగ్ ఒక్కటే వాటితో పోరాడలేదు. దీంతో దానికి గాడ్జిల్లా సాయం అవసరం పడుతుంది. ఇక కాంగ్ గాడ్జిల్లా కలిసి వాటిపై పోరాడి గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇక ఈ చిత్రంలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ 12 2024న ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

