Watch: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలు.. అడ్డగించి ఇటుకతో తలపై కొట్టిన మామ
Viral video | భర్త ప్రవీణ్ కుమార్ సంపాదనకు అండగా ఉండాలని అతడి భార్య కాజల్ భావించింది. తాను కూడా ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పింది. అయితే మామ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం చేయాలని కోడలు నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఒక మహిళ తన భర్త సంపాదనకు అండగా ఉండాలని భావించింది. ఆమె కూడా ఉద్యోగం చేయాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగం పొందేందుకు ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలిపై మామ ఇటుకతో దాడి చేశాడు. ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో కోడలు తీవ్రంగా గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భర్త ప్రవీణ్ కుమార్ సంపాదనకు అండగా ఉండాలని అతడి భార్య కాజల్ భావించింది. తాను కూడా ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పింది. అయితే మామ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం చేయాలని కోడలు నిర్ణయించింది.
కాగా, మంగళవారం ఉదయం జాబ్ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో నడుచుకుంటూ కాజల్ వెళ్తున్నది. దీంతో మామ ఆమెను అనుసరించి అడ్డగించాడు. చేతిలో ఉన్న ఇటుక రాయితో కోడలు కాజల్ తలపై మోదాడు. ఆమె తప్పించుకుని పరుగులుపెట్టగా వెంబడించి మరీ ఇటుకతో ఆమె తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో కాజల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి అతడ్ని అడ్డుకున్నారు. గాయపడిన కాజల్‌ను భర్త ప్రవీణ్ కుమార్, సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆమె తలపై 17 కుట్లు పడ్డాయి.
మరోవైపు కాజల్ మామపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలిపై ఇటుక రాయితో మామ దాడి చేసిన సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Delhi man assaults daughter-in-law with brick after row over getting a job, incident caught on camera @ArvindKejriwal @AamAadmiParty @AmitShah @BJP4India @BJPLive @JPNadda #woman #poor #helpless #help #law #action #viral #MustWatch #humanity #HumanRights #India #Indian #ModiGovt pic.twitter.com/zAiaOasy0u
— (NPA) POLITICAL ANALYSIS (@AnalysisNpa) March 16, 2023
Also Read:
Two Wives | ఇద్దరు భార్యల దగ్గర చెరో 3 రోజులు ఉంటా.. లాయర్ సమక్షంలో భర్త ఒప్పందం
మోదీ ప్రారంభించిన మూడో రోజే గుంతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

