Assistant Hacks Lawyer | కోర్టు బయట లాయర్‌ను కొడవలితో నరికిన అసిస్టెంట్
Assistant Hacks Lawyer | ఒక లాయర్‌పై అతడి అసిస్టెంట్ కొడవలితో దాడి చేశాడు. కోర్టు బయట అంతా చూస్తుండగా తల, మెడపై నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆ న్యాయవాది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
చెన్నై: ఒక లాయర్‌పై అతడి అసిస్టెంట్ కొడవలితో దాడి చేశాడు. కోర్టు బయట అంతా చూస్తుండగా తల, మెడపై నరికాడు. (Assistant Hacks Lawyer) తీవ్రంగా గాయపడిన ఆ న్యాయవాది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం జిల్లా కోర్టు బయట న్యాయవాది కన్నన్‌పై అతడి సహాయకుడు ఆనంద్ కుమార్ కొడవలితో దాడి చేశాడు. ఆ లాయర్ తల, మెడపై నరికాడు. దీంతో తల, మెడ, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రక్తం కారుతూ రోడ్డుపై పడిన లాయర్ కన్నన్ను తోటి న్యాయవాదులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, లాయర్‌పై దాడి చేసిన నిందితుడు ఆనంద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత శత్రుత్వమే ఈ దాడికి కారణమని తెలిపారు. వారిద్దరి మధ్య గతంలో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్లిన వారిద్దరూ ఆ తర్వాత రాజీపడ్డారని పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు ఈ సంఘటనపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, లాయర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, కొందరు వ్యక్తులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“சட்டம் ஒழுங்கு லட்சணம்”
அந்த இரும்புக்கரம் எங்கடா இருக்கு!#Krishnagiri pic.twitter.com/ZNlMCBnreS— மாண்புமிகு மக்கள் (@Page4People) November 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

