Amritpal Singh | కార్లు, వేషాలు మార్చి తిరుగుతున్న అమృత్పాల్.. టోల్గేట్ వద్ద సెక్యూరిటీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు..!
Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistani) వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ (Waris Punjab De) నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ (Punjab) రాష్ట్రాన్ని దాటి వెళ్లినట్లు తెలుస్తోంది.
Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistani) వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ (Waris Punjab De) నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అతడి జాడను మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ (Punjab) రాష్ట్రాన్ని దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్గేట్ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) చివరిసారిగా మెర్సిడెస్ ఎస్యూవీలో (Mercedes SUV)లో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రిజా ( Brezza) కారులో జలంధర్ (Jalandhar)లోని టోల్గేట్ (toll booth)ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్ (security footage)లో రికార్డయ్యాయి. అమృత్పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కార్లు, వేషాలు మారుస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా అతను తన మత దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పేర్కొంటున్నాయి.
మరోవైపు అమృత్పాల్ సింగ్ తప్పించుకోవడంపై పంజాబ్ హైకోర్టు మండిపడింది. 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి అతను ఎలా తప్పించుకున్నాడు అని ప్రశ్నించింది. ‘80 వేల మంది పోలీసులున్నారు.. మీరేం చేస్తున్నారు..? అమృత్పాల్ సింగ్ ఎలా ఎస్కేప్ అయ్యారు’ అని ప్రశ్నించింది. అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్పై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేయాలని శనివారం ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పంజాబ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఖలిస్తాన్ (Khalistani) నేత అమృత్పాల్ (Amritpal Singh) కు చెందిన 120 మంది మద్దతుదారుల్ని(supporters) అరెస్టు చేసినట్లు చెప్పారు.
Also Read..
Amritpal Singh: 80 వేల మంది పోలీసులున్నారు.. అమృత్పాల్ ఎలా తప్పించుకున్నాడు?
Chetan Kumar | హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్.. నటుడు చేతన్ కుమార్ అరెస్ట్
Delhi Budget: ఢిల్లీ బడ్జెట్ను ఆపకండి.. ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

