August 15: ఎర్రకోట అతిథులుగా భారత ఒలింపిక్ బృందం

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందంతో ప్రధాని మోదీ .. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన భేటీకానున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఆయన ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు. ఆ సమయంలో వారందరితో వ్యక్తిగతంగా మోదీ భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ భారీ సంఖ్యలో అథ్లెట్లను పంపింది. సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్‌లు, అసిస్టెంట్ సిబ్బంది ఉన్నారు. ఓ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈసారి భారీ సంఖ్యలో భారత బృందాన్ని ఒలింపిక్స్ పంపినట్లు చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘనత సాధించడం అద్వితీయమన్నారు. అనేక క్రీడల్లో మొదటిసారి క్వాలిఫై అయ్యామని, అర్హత సాధించడమే కాదు, గట్టి పోటీ ఇస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ ఒలింపిక్స్‌లో ప్రతి ఆటలోనూ భారత ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. మన ఆటగాళ్లు తమకన్నా మేటి ర్యాంక్‌లో ఉన్నవారి పోరాడుతున్నట్లు చెప్పారు. భారతీయ క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, దీక్ష, ఉత్సాహం చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిపారు. సరైన ట్యాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహిస్తే ఇలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని మోదీ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

